Ap news: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ బుధవారం భేటీ అయింది.సమావేశంలో రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ తెలిపింది. నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ ను మరింత పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు కూడా ఓకే చెప్పారు. అదేవిధంగా లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రుల, ప్రభుత్వ సలహాదారులు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ
ఏపీ టవర్ కార్పొరేషన్ ను ఫైబర్ గ్రిడ్ లో విలీనం చేయాలని నిర్ణయించారు. కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పునరుద్ధరించనున్నారు. దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
*కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ లు పునరుద్ధరించాలని నిర్ణయం
*ఏపీ టవర్ కార్పొరేషన్ ను ఫైబర్ గ్రిడ్ లో విలీనం చేయాలని నిర్ణయం
*అమరావతి సాంకేతిక కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం
*కొత్తగా టెండర్లు పిలిచి అమరావతి నిర్మాణ పనులు కొంసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలు
*స్పోర్ట్స్ పాలసీ, పర్యాటక పాలసీలకు మంత్రివర్గం ఆమోదం.
*విజయవాడ విశాఖ మెట్రో రైల్ కు 100 శాతం కేంద్ర నిధులతో నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
*రాష్ట్రంలో 85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
*నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
*లోకాయుక్త చట్ట సవరణ బిల్లు కు మంత్రివర్గం ఆమోదం *లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనేదానిపై చర్చ
*పార్లమెంట్ లో అనుసరించిన విధానం కొనసాగించాలని నిర్ణయం
*దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టసవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
*కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కు నిర్ణయం
*ఈగల్ పేరు తో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటుకు నిర్ణయం