South Africa:

South Africa: ఆఫ్రికా ఖండంలో వ‌ర్ష బీభ‌త్సం.. భారీగా ప్రాణ‌, ఆస్తిన‌ష్టం

South Africa: ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. కుండ‌పోత వ‌ర్షాల‌తో జ‌లాశ‌యాలు పొంగిపొర్లుతున్నాయి. ఫ‌లితంగా పెద్ద ఎత్తున‌ వ‌ర‌ద‌లు పోటెత్తుతున్నాయి. భారీ వ‌ర‌ద‌ల ధాటికి పెద్ద ఎత్తున ఆస్తిన‌ష్టం సంభ‌వించింది. పెద్ద సంఖ్య‌లో ప్రాణ‌న‌ష్టం సంభ‌వించింది. ఈ విప‌త్తుతో ఆఫ్రికా ఖండంలోని మొజాంబిక్‌, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా దేశాల్లో తీవ్ర న‌ష్టం వాటిల్లింది. జ‌న‌జీవ‌నం అత‌లాకుత‌ల‌మై స్తంభించిపోయింది.

South Africa: తాజా వార్త‌ల ప్ర‌కారం.. వ‌ర‌ద‌ల కార‌ణంగా జింబాబ్వేలో 80 మందికి పైగా ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా ద‌క్షిణాఫ్రికా దేశంలో 35 మందికి పైగా చ‌నిపోయారు. వీటితోపాటు వివిధ దేశాల్లో వ‌ర‌ద‌ల కార‌ణంగా 150 మంది వ‌ర‌కు మృతి చెందిన‌ట్టు స‌మాచారం అందుతున్న‌ది. మ‌రెంద‌రో గాయాల‌పాల‌య్యార‌ని తెలుస్తున్న‌ది. ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. వివిధ ప్రాంతాల్లో ఆహారం కోసం హాహాకారాలు పెడుతున్నారు.

South Africa: మొజాంబిక్ దేశంలో ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింది. భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా సుమారు ఆ ఒక్క దేశంలోనే సుమారు 2 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. అనేక భ‌వ‌నాలు, వంతెన‌లు వ‌ర‌ద‌ల ధాటికి కొట్టుకుపోయాయి. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా హెలికాప్ట‌ర్ల ద్వారా బాధితుల‌ను సురక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. వ‌ర‌ద బాధితులు త‌ల‌దాచుకున్న ప్రాంతాల్లో ఆహార పొట్లాల‌ను జార విడుస్తున్నారు.

South Africa: మొజాంబిక్ దేశంలోని ఓ జాతీయ పార్కులోకి భారీగా వ‌ర‌ద‌లు చేరుకున్న‌ట్టు స‌మాచారం అందింది. ఈ స‌మ‌యంలో ఆ పార్కులో సుమారు 600 మంది ప‌ర్యాట‌క‌లు చిక్కుకున్న‌ట్టు స‌మ‌చాఆరం. వారిని ర‌క్షించేందుకు స‌హాయ‌క బృందాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై బాధిత దేశాల ప్ర‌భుత్వాలు హైఅల‌ర్ట్‌ను ప్ర‌క‌టించి, స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *