Chandrababu Naidu:

Chandrababu Naidu: ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా చంద్ర‌బాబు, లోకేశ్ ఏమ‌న్నారంటే?

Chandrababu Naidu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి, ఆయ‌న అల్లుడు నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న మ‌న‌మ‌డు, ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. త‌మ ఎక్స్ వేదిక‌ల‌పై త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు. వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్‌కు నివాళుల‌ర్పించారు.

Chandrababu Naidu: హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద ఆయ‌న త‌న‌యుడు, ప్ర‌ముఖ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ, మంత్రి నారా లోకేశ్ వారి ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఎన్టీఆర్‌కు నివాళుర్పించారు. పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు చేరుకొని శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ విగ్ర‌హాలు, చిత్ర‌ప‌టాలకు అభిమానులు, టీడీపీ శ్రేణులు, ప్ర‌ముఖులు నివాళుల‌ర్పించారు.

ఎన్టీఆర్ కార‌ణ‌జ‌న్ముడు: చంద్ర‌బాబు నాయుడు
Chandrababu Naidu: నంద‌మూరి తారక‌రామారావు కార‌ణ‌జ‌న్ముడ‌ని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కొనియాడారు. ఎక్స్ వేదిక‌పై ఎన్టీఆర్ 30వ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని నివాళుల‌ర్పించారు. యుగ‌పురుషుడు, పేద‌ల పెన్నిధి అయిన ఎన్టీఆర్ ప్ర‌జ‌ల చేత అన్నా అని పిలిపించుకున్నార‌ని పేర్కొన్నారు. సినీ వినీలాకాశంలో ఒక వెలుగు వెలిగి, రాజ‌కీయ కురుక్షేత్రంలోనూ అజేయుడై త‌ర‌త‌రాల చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన ధీరోదాత్తుడ‌ని అభిర్ణించారు.

Chandrababu Naidu: తెల‌గువారి ఆత్మ‌గౌర‌వాన్ని ఆకాశ‌మంత ఎత్తులో నిల‌బెట్టేందుకు పోరాడిన ఆయ‌న మ‌నంద‌రికీ ప్రాతఃస్మ‌ర‌ణీయుడ‌ని చంద్ర‌బాబు నాయుడు కొనియాడారు. రెండు రూపాయ‌ల‌కు కిలో బియ్యం, సామాజిక పింఛ‌న్ ప‌థ‌కం, ప‌క్కా ఇళ్ల నిర్మాణం, రైతుల‌కు విద్యుత్తు, మండ‌ల వ్య‌వ‌స్థ‌, స్థానిక ప‌రిపాల‌న‌, ఆడ‌బిడ్డ‌ల‌కు ఆస్తిలో హ‌క్కు, రాయ‌ల‌సీమ‌కు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనిత‌ర సాధ్య‌మైన అభివృద్ధి సంక్షేమ ప‌థ‌కాల‌ను మ‌న‌కందించిన మ‌హ‌నీయుడ‌ని కొనియాడారు.

ఎన్టీఆర్ ప్ర‌జ‌ల దేవుడు: నారా లోకేశ్‌
Chandrababu Naidu: తెలుగు జాతి ఆత్మ‌గౌరవ ప‌తాకం, విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు, మ‌హానాయుడైన దివంగ‌త‌ ఎన్టీఆర్ ప్ర‌జ‌ల దేవుడిగా కీర్తించ‌బ‌డ్డార‌ని ఏపీ ఐటీ, విద్యాశాఖ‌ మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. తార‌క‌రాముడు పోషించిన పౌరాణిక పాత్ర‌ల ఫొటోల‌ను ఇళ్ల‌లో పెట్టుకొని ప్ర‌జ‌లు దేవుడిగా పూజిస్తుండ‌టం ఎన్టీఆర్‌కే ద‌క్కిన అరుదైన గౌర‌వ‌మ‌ని కీర్తించారు. భౌతికంగా దూర‌మై ఇన్నేళ్ల‌యినా తెలుగు వారి హృద‌యాల్లో స‌జీవంగా ఉన్న తాత‌య్యా.. మీ జ‌న్మ ధ‌న్య‌మ‌య్యా.. అంటూ లోకేశ్ ప్ర‌శ‌సించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *