Roger Federer: స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్.. స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఇద్దరూ ఇద్దరే..టెన్నిస్ కోర్టులో ప్రియమైన శత్రువులు.. టెన్నిస్ కోర్టు బయట ప్రాణ స్నేహితులు. తాజాగా డేవిస్ కప్ తో నడాల్ టెన్నిస్ నుంచి తప్పుకుంటున్న నడాల్ కు .. గతంలోనే ఫెడరర్ టెన్నిస్ కు గుడ్ బై చెప్పిన ఫెడరర్ నాటి జ్ఞాపకాలతో లేఖ రాసాడు.. ఉజ్వలంగా సాగిన అతని కెరీర్ ను ఎంతో మెచ్చుకున్నాడు ఫెడరర్.
Roger Federer: టెన్నిస్ ప్రపంచంలో స్పెయిన్ స్టార్ రఫెల్ నడాల్, రోజర్ ఫెడరర్ సుదీర్ఘ కాలం ఆటను శాసించారు. స్విస్ దిగ్గజం ఫెడరర్ రెండేళ్ల క్రితం రిటైర్ కాగా.. ఇప్పుడు నాదల్ వంతు వచ్చింది. ప్రస్తుతం డచ్ టీమ్ తో జరుగుతున్న డేవిస్ కప్ తో టెన్నిస్ కు గుడ్ బై చెప్పనున్నాడు నడాల్. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఫెడరర్ తనకెరీర్ ముగిస్తే… 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో నాదల్ గుడ్‌బై చెబుతున్నాడు. వీరిద్దరూ కోర్టులో ప్రత్యర్థులే అయినా మైదానం బయట మంచి స్నేహం ఉంది. ప్రపంచ టెన్నిస్ సర్క్యూట్‌లో తమ పరస్పర గౌరవాన్ని, అభిమానాన్ని వీరిద్దరు చాలాసార్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా నడాల్ రిటైర్మెంట్ నేపథ్యంలో నాటి జ్ఞాపకాలతో ఫెడరర్ ఒక లేఖ రాయడం.. అందులో అతని ఆటను విశ్లేషించడంతో లేఖ అద్భుతంగా సాగింది. నేను నీపై గెలిచిన మ్యాచ్‌లకంటే నువ్వు నన్ను ఎక్కువ సార్లు ఓడించావు. నీలా నాకు టెన్నిస్ కోర్టులో ఎవరూ సవాల్ విసరలేదు. క్లే కోర్టుపైన అయితే నీముందు నిలబడడం కూడా కష్టమయ్యేదని అతని ఆటపై ఫెడరర్ ప్రశంసం వర్షం కురిపించాడు.
Roger Federer: కోర్టులో నడాల్ హావభావాలు గుర్తు చేస్తూ ఫన్నీగా స్పందించాడు ఫెడరర్.. గతంలో మ్యాచ్ సమయంలో బొమ్మల కొలువులా వాటర్ బాటిల్స్‌ను పేర్చడం, జుట్టు సవరించుకోవడం, అండర్‌వేర్‌ను సరిచేసుకోవడం నువ్వు చేస్తుండగా చూస్తుంటే నాకు ఎంతో ఇష్టంగా ఉండేదని గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు టెన్నిస్‌పై నా ఇష్టం మరింత పెరిగేలా చేశావన్నాడు. దాదాపు ఒకే సమయంలో కెరీర్ ప్రారంభించినా 20 ఏళ్ల తర్వాత చూస్తే నువ్వు అద్భుతాలు చేసి చూపించావు. 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌తో స్పెయిన్ తో పాటు యావత్ టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా చేశావన్నాడు ఫెడరర్.. నా ఆటలో లోపాలు ఉన్నాయేమో అని చూసుకునేలా.. నీపై పైచేయి సాధించే క్రమంలో రాకెట్ మార్చుకుని నా అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వచ్చిందంటూ టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్న నడాల్ ను మెచ్చుకుంటూ ప్రశంసాపూర్వకంగా వ్యాఖ్యానించాడు. 2004 మయామి ఓపెన్‌తో మొదలు పెట్టి ఫెడరర్, నడాల్ 40 సార్లు తలపడగా.. ఇందులో నడాల్24 సార్లు, ఫెడరర్ 16 సార్లు గెలిచాడు.
Roger Federer: తొలిసారి వరల్డ్ నంబర్‌వన్‌గా మారి సగర్వంగా నిలిచినప్పుడు నీతో మయామిలో తలపడి ఓడాను. అరుదైన ప్రతిభ గలవాడివని, ఎన్నో ఘనతలు సాధిస్తావని అప్పటి వరకు నీ గురించి గొప్పగా విన్నదంతా వాస్తవమేనని అర్థమైంది. కొన్నిసార్లు ఎంతగా పోరాడే వాళ్లమంటే ఆట ముగిశాక వేదికపై ఒకరిని పట్టుకొని మరొకరు నడవాల్సి వచ్చేదని లేఖలో ఫెడరర్ గుర్తు చేసుకున్నాడు.. లేవర్ కప్‌లో చివరిసారి నీతో కలిసి ఆడినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. నా కెరీర్‌లో అవి ఎంతో ప్రత్యేక క్షణాలంటూ భావోద్వేగం ప్రదర్శించాడు.

