Minister savita: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి సవిత వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జగన్‌కు సద్బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ని కోరుతున్నానని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్టాలు ఎక్కుతున్న వేగాన్ని తట్టుకోలేక జగన్ విష ప్రచారానికి దిగజారుతున్నారని విమర్శించారు.
మంత్రి సవిత మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను జగన్ అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయని, కేవలం భారతదేశం మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చి చేరుతున్నాయని చెప్పారు.
అక్రమ కేసుల్లో చిక్కుకున్న చంద్రబాబు “కడిగిన ముత్యంలా” బయటకు రావడం రాష్ట్ర ప్రజలకు సంతోషాన్ని ఇచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పటి చంద్రబాబు అరెస్ట్‌ను ప్రపంచం ఖండించిందని, ఆయనపై ప్రజలకు నమ్మకం పుష్కలంగా ఉందని తెలిపారు.
సవిత మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా వచ్చిన తీర్పు ప్రతి ఒక్కరికి ఆనందాన్ని నింపిందని అన్నారు. అయితే, జగన్‌కు సవాల్ విసురుతూ, దమ్ముంటే కనీసం ఒక కేసులో అయినా నిర్దోషిగా బయటపడాలని ఆమె ప్రశ్నించారు. చివరగా, పండుగ సమయంలో జగన్ పేరు కూడా ప్రస్తావించడం మంచిది కాదని వ్యాఖ్యానిస్తూ తన మాటలను ముగించారు.
