Viral News: రీల్స్.. ఈ పేరు వింటేనే భయం వేస్తుంది. అందరూ చేస్తున్నా అందులో కొంతమందే అనుకున్న అంత స్థాయికి చేరుకుంటున్నారు. రీల్స్ పేరుతో ఎక్కడ పడితే అక్కడే డాన్సులు, వింత చేష్టలు.. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘోరాలు. అలాంటిదే తాజాగా ఒకటి జరిగింది. రీల్స్ చేస్తున్న సమయంలో తనని చూశాడని గొడవ పెట్టుకున్న వైనం.. మాట మాట పెరగడంతో రెండు గ్రూపులుగా మారి నడిరోడ్డుపై ఒకరిని ఒకరు చితకబాదుకున్నారు.
విషయానికి వస్తే.. అర్ధరాత్రి నడిరోడ్డుపై రీల్స్ చేస్తున్న ఒక యువకుడు.. అదే సమయానికి అటువైపుగా బైక్ పైన వెళ్తున్న మరో యువకుడు రీల్స్ చేస్తున్న యువకుడిని చూస్తూ వెళ్లిపోయాడు. అక్కడే మొదలైంది గొడవ. తనను అసభ్యకరమైన రీతిలో చూశాడంటూ బైక్ పైన వెళ్తున్న వ్యక్తిని ఆపి నిలదీసిన యువకుడు.
ఇది కూడా చదవండి: Nimmala: వృధా నీటిని వాడుకుంటాం
రీల్స్ ఎలా చేస్తున్నారు అని సాధారణంగా చూశాను అని చెప్పిన వ్యక్తి మాట వినకుండా, “లేదు నువ్వు నీచంగా చూశావ్” అంటూ యువకుడు గొడవకు దిగాడు. ఈ క్రమంలో మాట మాట పెరిగి పెద్ద గొడవ జరిగింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది ఘర్షణ. నడిరోడ్డుపై గొడవ జరగడంతో జనాలు గుంపులుగా గుమిగూడి వారి గొడవని చూశారు.
రీల్స్ మోజులో నడిరోడ్డుపై రచ్చ.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ
వనపర్తిలోని బస్టాండ్ సమీపంలో.. రాత్రి సమయంలో నడిరోడ్డుపై రీల్స్ చేసిన ఓ యువకుడు
సరిగ్గా అదే టైంలో బైక్పై వెళ్తూ.. రీల్స్ చేసే యువకుడ్ని చూసుకుంటూ వెళ్లిన మరో అబ్బాయి
అయితే.. అతడు తనను అసభ్యకరమైన రీతిలో చూశాడని, వాహనం ఆపి… pic.twitter.com/2Y841PafSO
— PulseNewsBreaking (@pulsenewsbreak) January 12, 2026
