Rajasaab: ప్రభాస్ రాజాసాబ్ సినిమా వచ్చి ఒకరోజు కాకముందే వివాదం చుట్టుముట్టింది. ఇది టాలీవుడ్, బాలీవుడ్ కాదు.. అంతర్జాతీయ స్థాయిలో ఆ చిక్క వచ్చి పడింది. ఆ సినిమాలోని ఓ పాట ట్యూన్ తనదేనంటూ ప్రముఖ సింగర్ ముందుకొచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలను వీడియలో చూపుతూ సోషల్ మీడియా వేదికెక్కారు ఆయన. దీంతో తమన్‌పై మరో మచ్చపడినట్టయింది.
Rajasaab: రాజాసాబ్ సినిమాలోని నాచే నాచే పాటను బాలీవుడ్‌లోని ఓ సినిమాలోని పాటను రీమిక్స్ చేసినట్టు తెలిసింది. అయితే అదే పాటలో తన మ్యూజిక్‌ను కాపీ కొట్టారని స్వీడన్‌కు చెందిన ప్రముఖ డీజే వీడోజీన్ ఆరోపించడం సంచలన సృష్టించింది. తన పాట 2024లోనే ఓ మ్యూజిక్ బీట్‌ను రూపిందించినట్టు చెప్పారు. దానిలోని ట్యూన్‌ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాపీ కొట్టారని ఆరోపణలు చేశారు.
Rajasaab: రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ నటన అద్భుతమని వీడోజీన్ కొనియాడటం విశేషం. కానీ తన మ్యూజిక్‌ను కాపీ చేయడంపై మాత్రం ఆయన అసహనం వ్యక్తంచేశారు. తన పాటలో ఉన్న ట్యూన్‌ను ఓ వీడియోలో చూపుతూ.. రాజాసాబ్ సినిమాలోని మ్యూజిక్‌ను చూపుతూ ఆయన లైవ్‌లో అభ్యంతరాలను వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా డీజే వీడోజీన్ చెప్పు చూపుతూ తన మ్యూజిక్ కాపీ కొట్టడంపై హెచ్చరికలు జారీ చేయడం కూడా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికల్లో వైరల్‌గా మారింది.
