World News:

World News: 2026 ఏడాదిపై బాబా వంగా, నోస్ట్ర‌డామ‌స్ చెప్పిందే నిజ‌మ‌వుతుందా?

World News: బాబా వంగా, నోస్ట్ర‌డామ‌స్‌లు ఇద్ద‌రూ చెప్పిన జోతిష్యం అంశాల‌పై ప్ర‌పంచ ఏటా ఉత్కంఠ‌తో కాలం గ‌డుపుతున్న‌ది. ఏటేటా వారు చెప్పిన ఎన్నో జోస్యాలు నిజ‌మై తీరాయి. ప్ర‌పంచంలో ఎంద‌రో ఇలాంటి జోతిష్య అంశాలు చెప్పినా.. వీరిద్ద‌రు చెప్పినవే ఎన్నోమార్లు వాస్త‌వంగా జ‌రిగాయి. దీంతో వారు చెప్పిన అంశాల‌కు ప్రాచుర్యం పెరిగింది. దీంతో ఈ ఏడాది (2026లో) వారు చెప్పిన కొన్ని అంశాలు ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.

World News: బ‌ల్గేరియాకు చెందిన బాబా వంగా, ప్రెంచ్ ఆస్ట్రాల‌జ‌ర్ నోస్ట్ర‌డామ‌స్ ఈ 2026పై చెప్పిన భ‌విష్య‌వాణి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ 2026వ సంవ‌త్స‌రంలో ప్రపంచ యుద్ధం మొద‌ల‌వుతుంద‌ని వారిద్ద‌రూ చెప్పారు. దీంతో తాజా సంఘ‌ట‌న‌ల‌ను పోల్చుకొని అది నిజ‌మే కావ‌చ్చ‌ని భావిస్తున్నారు. ర‌ష్యా-ఉక్రెయిన్‌, చైనా-తైవాన్‌, అమెరికా-వెనెజులా, ఇజ్రాయిల్‌-అర‌బ్ దేశాలు, అమెరికా-ఇరాన్ ఉద్రిక్త‌త‌లు, భార‌త్‌-పాకిస్థాన్ ఉద్రిక్త‌త‌లపై రూఢీ చేసుకుంటున్నారు.

World News: 2026లో మూడో ప్ర‌పంచ యుద్ధం ప్రారంభ‌మ‌వుతుంద‌ని, మాన‌వాళికి తొలిసారిగా ఈ ఏడాదిలోనే గ్ర‌హాంత‌ర‌వాసుల‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంద‌ని బాబా జోస్యం చెప్పారు. ఈ రెండు అంశాల‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా తీవ్ర సంక్షోభానికి లేదా వినాశ‌నానికి దారి తీయవ‌చ్చ‌ని ఆమె హెచ్చ‌రించిన‌ట్టు తెలుస్తున్న‌ది. గ్ర‌హాంత‌ర వాసుల అంశంపై గ‌త నెల‌లోనే భూమికి అతి స‌మీపంలోకి వ‌చ్చిన 31/ATLAS అనే ఓ ర‌హ‌స్య వ‌స్తువును దీనికి సంకేతంగా కొంద‌రు సిద్ధాంత‌క‌ర్త‌లు అనుమానిస్తున్నారు.

World News: అదే విధంగా నోస్ట్ర‌డామ‌స్ అంచనాలు కూడా ప్ర‌పంచవ్యాప్తంగా వైర‌ల్ అవుతున్నాయి. ఈ 2026 సంవ‌త్స‌రంలో ఒక ప్ర‌ముఖ వ్య‌క్తి హ‌త్య‌కు గుర‌య్యే అవ‌కాశం ఉన్న‌ద‌ని, లేదా ఒక రాజ‌కీయ పాల‌న‌ను కూల్చే కుట్ర జ‌రుగుతుంద‌ని చెప్పారు. అలాగా ఇదే సంవ‌త్స‌రం 7 నెల‌ల‌పాటు సాగే ఓ భారీ యుద్ధం గురించి కూడా ఆయ‌న త‌న ర‌చ‌న‌ల్లో పొందుప‌ర్చారు.

World News: వీరిద్ద‌రూ చెప్పిన అంశాల ఆధారంగా ఈ 2026లోనే మూడో ప్ర‌పంచ‌యుద్ధం జ‌రిగే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ముఖ్యంగా ర‌ష్యా-అమెరికా, చైనా-తైవాన్ ఉద్రిక్త‌త‌లు అందుకు నిద‌ర్శ‌నాలుగా అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధంగా సుదీర్ఘ‌కాలంగా కొన‌సాగుతుండ‌టం గ‌మ‌నార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *