Congress Party:

Congress Party: ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డికి కీల‌క బాధ్య‌త‌లు.. 5 రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్‌ ప‌రిశీల‌కుల ఎంపిక‌

Congress Party: త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల‌కు జ‌రిగే ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ప‌రిశీల‌కులుగా ఆ పార్టీ జాతీయ క‌మిటీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ఎన్నిక‌ల ప‌రిశీల‌కుల జాబితాను వెల్ల‌డించారు. కాంగ్రెస్ పార్టీ ప‌రిశీల‌కుల ఎన్నిక వెంట‌నే అమ‌లులోకి వ‌స్తుంద‌ని ఖ‌ర్గే ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు అస్సాం, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, పుదుచ్చేరి, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎన్నిక‌ల ప‌రిశీల‌కుల జాబితాను ఏఐసీసీ ప్ర‌క‌టించింది. వీరిలో త‌మిళ‌నాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడిగా తెలంగాణ నీటి పారుద‌ల శాఖ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్య‌క్షుడు ఎన్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిని నియ‌మించ‌డం గ‌మ‌నార్హం.

అస్సాం రాష్ట్ర ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు వీరే
1) భూపేష్ భాగేల్‌
2) డీకే శివ‌కుమార్‌
3) బంధు తిర్కే
కేర‌ళ రాష్ట్ర ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు వీరే
1) స‌చిన్ పైల‌ట్‌
2) కేజే జార్జ్‌
3) ఇమ్రాన్ ప్ర‌తాప్‌ఘ‌ర్‌
4) క‌న్హ‌య్య కుమార్‌
త‌మిళ‌నాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు వీరే
1) ముఖుల్ వాస్నిక్‌
2) ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి
3) ఖ్వాజీ మ‌హ‌మ్మ‌ద్ నిజాముద్దీన్‌
ప‌శ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు వీరే
1) సుదీప్‌రాయ్ బ‌ర్మ‌న్‌
2) ష‌కీల్ అహ్మ‌ద్ ఖాన్‌
3) ప్ర‌కాశ్ జోషి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *