China: అమెరికా పై విరుచుకుపడ్డ చైనా

China: వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్లను అమెరికా సైనిక బలగాలు అదుపులోకి తీసుకుని న్యూయార్క్‌కు తరలించిన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ, అమెరికా తనను తాను ప్రపంచ పోలీస్‌గా భావిస్తూ ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. ఏ దేశానికీ అంతర్జాతీయ న్యాయమూర్తిగా వ్యవహరించే హక్కు లేదని, బలప్రయోగంతో తన ఇష్టాలను రుద్దడం సరికాదని స్పష్టం చేశారు.

ప్రపంచంలో శాంతి నెలకొనాలంటే అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని వాంగ్ యీ పేర్కొన్నారు. చైనా ఎప్పుడూ బలప్రయోగాన్ని సమర్థించదని, అంతర్జాతీయ చట్టాలు అన్ని దేశాల హక్కులను కాపాడాలని అన్నారు.

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పటికే అస్థిరంగా ఉన్నాయని, ఇలాంటి చర్యలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయని చైనా ఆందోళన వ్యక్తం చేసింది. గత రెండు దశాబ్దాలుగా వెనెజువెలా చమురును భారీగా కొనుగోలు చేస్తున్న చైనా, ఈ ఘటనను ఏకపక్ష దురాక్రమణగా అభివర్ణిస్తూ అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *