Mrs India 2024: మిసెస్ ఇండియా 2024 పోటీల్లో తెలంగాణా హీరోయిన్ హేమలతా రెడ్డి అవార్డు గెలుచుకున్నారు. మలేషియాలో జరుగిన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో మిసెస్ ఇండియా 2004 అవార్డు ఆమెకు వచ్చింది. అంతేకాకుండా ఆమె బెస్ట్ టాలెంట్ – బెస్ట్ ఫొటోజెనిక్ గా కూడా ఎంపికయ్యారు. జెమినీ టీవీ యాంకర్ గా చేసి తరువాత నిన్ను చూస్తూ సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిన హేమలత రెడ్డి అవార్డు గెలుచుకోవడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Mrs India 2024: ఈపోటీల కోసం హేమలతా రెడ్డి సంవత్సరం క్రితమే ఆడిషన్స్ కు వెళ్లారు. ఆ తరువాత మిసెస్ 2024 పోటీల కోసం సన్నద్ధమయ్యారు. అందాల పోటీల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చే గ్రూమర్స్ ద్వారా ఆమె పోటీలకు సిద్ధం అయ్యారు. దీంతో ఆమె మిసెస్ 2024 గా ఎంపిక అయ్యారు. ఈ అవార్డు గెలుచుకున్న తరువాత ఆమె అంతర్జాతీయ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. గ్లామన్ డైరెక్టర్ మన్ దువా ఈ సందర్భంగా హేమలతను అభినందించారు. హైదరాబాద్ కు, తెలంగాణాకు మంచి పేరు తీసుకు వచ్చారని ప్రశంసించారు. పోటీల్లో విజేతగా నిలిచినా అనంతరం మలేషియాలోని ప్రసిద్ధ బాటు కేశవరా ఆలయాన్ని మన్ దువాతో కలిసి హేమలత సందర్శించారు.