Sharwanand: హీరో శర్వానంద్ కొత్త సినిమాలో కన్నడ టాప్ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించనుంది. దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ తో పాపులర్ అయిన రుక్మిణీ ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
Also Read: Jananayagan: ‘జననాయగన్’ రీమేక్ వార్తలతో బాలయ్య సినిమాను మళ్ళీ ట్రెండింగ్‌లోకి
దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో కొత్త చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో కన్నడ నటి రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. ‘కాంతార’ చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణీ.. శర్వానంద్ సరసన నటించడం ఆసక్తికరంగా మారింది. మార్చి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన ‘విశ్వం’ చిత్రం, బాక్స్ ఆఫిస్ వద్ద ఏవరేజ్ గా నిలిచింది. దీంతో మరో హిట్ కోసం శ్రీను వైట్ల తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ చిత్ర కథలో యువకుడు ఆవేశంలో చేసిన పని వల్ల జరిగే డ్రామా ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది. ఓ సీనియర్ హీరో కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మాణం జరుగుతోంది. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందని సమాచారం.
