Rohini: షార్ట్స్ లండన్ లో వేస్తారు.. మన కాడ కాదు.. మనం చీర కడ్తాం.. వైరల్ కామెంట్స్ చేసిన నటి

Rohini: ప్రముఖ సినీ నటి రోహిణి దుస్తులు, సంస్కృతి, పిల్లల పెంపకం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో చీరలు కట్టుకోవడం అలవాటు అయితే, లండన్ వంటి విదేశాల్లో షార్ట్స్, స్కర్ట్స్ వేసుకోవడం అక్కడి సంస్కృతి అని చెప్పారు. ప్రాంతాన్ని బట్టి అలవాట్లు మారతాయి, ఎవరి జీవనశైలి వారికి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

పిల్లలు తప్పుదారి పట్టకుండా మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని రోహిణి అన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌, చెడు అలవాట్ల బారిన పడుతున్న విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా, తల్లిదండ్రులు కూడా తమ వంతు బాధ్యత తీసుకోవాలి అని సూచించారు.

పిల్లల్లో ఏవైనా మార్పులు కనిపిస్తే వారితో ఓపికగా మాట్లాడాలని, చెడు అలవాట్ల వల్ల కలిగే నష్టాలను వివరించాలని చెప్పారు. పిల్లలు వింటారా వినరా అన్నది పక్కనపెడితే, మన బాధ్యతగా మనం చెప్పాల్సిందే అని వ్యాఖ్యానించారు.

అలాగే, అబ్బాయిలకూ ఇంటి పనులు నేర్పాలని, చదువు అందరికీ ముఖ్యమని రోహిణి తెలిపారు. సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించడంలో మహిళల పాత్ర చాలా కీలకమని చెప్పారు. రాబోయే తరాలు బాగుంటేనే భవిష్యత్తు బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *