Bunny vasu: హద్దులు దాటను.. ఆ సినిమాతో 6 కోట్లు లాస్

Bunny vasu: ఇటీవల కాలంలో నిర్మాతగా తనదైన మార్క్‌తో ముందుకు సాగుతున్న పేరు బన్నీ వాసు. చిన్న సినిమాలతోనే మంచి విజయాలు అందుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా విజయం–విఫలమవుతుందన్న అంచనాల్లో ఆయనకు మంచి అనుభవం ఉందన్న పేరు కూడా ఉంది.

అయితే, ‘మిత్రమండలి’ సినిమా విషయంలో తన అంచనాలు తప్పాయని బన్నీ వాసు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా అంగీకరించారు. ఆ సినిమా వల్ల సుమారు రూ.6 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించారు.

ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ, “‘మిత్రమండలి’ సినిమా ఫస్ట్ కాపీ చూసే సమయంలో నేను అక్కడ లేకపోవడం పెద్ద లోపంగా మారింది. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు నాకు అనిపించినదే చెప్పాను. కానీ థియేటర్‌లో సినిమా చూసినప్పుడే అసలు తప్పు ఎక్కడ జరిగిందో అర్థమైంది. నా అంచనా పూర్తిగా తప్పిపోయింది” అని తెలిపారు.

ఇక సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు.“ఆ రోజు స్టేజ్‌పై మాటల పరంగా నేను హద్దులు దాటాను. ఆ తర్వాత అరవింద్ గారు కూడా ఈ విషయం గురించి నాతో మాట్లాడారు. ఈ సినిమా కోసం కష్టపడి పనిచేసిన ఓ వ్యక్తికి హార్ట్ ఎటాక్ రావడం, విడుదలకు ముందే కొందరు నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం గురించి వినడం వల్ల ఆవేశంలో అలా మాట్లాడాను. ఇకపై అలాంటి తప్పులు చేయకూడదని బలంగా నిర్ణయించుకున్నాను” అని బన్నీ వాసు అన్నారు.

ఈ వ్యాఖ్యలతో బన్నీ వాసు తన తప్పును స్వయంగా ఒప్పుకుంటూ, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. ఆయన ఈ నిజాయితీపై సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *