Vishwak Sen

Vishwak Sen: సైలెంట్ గా విశ్వక్ సేన్ పొలిటికల్ డ్రామా.. త్వరలో టీజర్ రిలీజ్?

Vishwak Sen: టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ శైలే వేరు. ఫలితంతో సంబంధం లేకుండా, కథలో వైవిధ్యం ఉంటే చాలు ప్రాణం పెట్టి పనిచేసే నటుడు ఆయన. విభిన్నమైన ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నప్పటికీ, గత కొంతకాలంగా అదృష్టం మాత్రం విశ్వక్ దరికి చేరడం లేదు. 2024లో ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘గామి’, ‘మెకానిక్ రాఖీ’ చిత్రాలతో పాటు, ఇటీవలే 2025లో వచ్చిన ‘లైలా’ కూడా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. అయితే ఈ వరుస పరాజయాలు విశ్వక్ జోరును ఏమాత్రం తగ్గించలేదు. ఒక సాలిడ్ హిట్‌తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని నిర్ణయించుకున్న ఈ ‘మాస్ కా దాస్’, ఇప్పుడు 2026 సంవత్సరాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నాడు.

విశ్వక్ సేన్ తన తదుపరి పోరాటాన్ని నవ్వులతో మొదలుపెట్టబోతున్నాడు. ‘జాతి రత్నాలు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు కేవీ అనుదీప్ కాంబినేషన్‌లో విశ్వక్ ఒక హిలేరియస్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఫంకీ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. యూనిక్ స్టోరీ లైన్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం విశ్వక్ సేన్‌కు మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని ట్రేడ్ వర్గాల్లో గట్టి నమ్మకం కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: Weather Alert: తెలుగు రాష్ట్రాలకు వెదర్ అలర్ట్ అటు వణుకు.. ఇటు చినుకు! రాబోయే 3 రోజుల రిపోర్ట్ ఇదే..

కేవలం కామెడీ మాత్రమే కాకుండా, ఈసారి పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాతో విశ్వక్ తన విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. ‘పిండం’ వంటి హారర్ థ్రిల్లర్‌తో ఆకట్టుకున్న దర్శకుడు సాయి కిరణ్ దైదాతో విశ్వక్ సేన్ చేతులు కలిపాడు. వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రానికి సంబంధించి విడుదలైన “సింహాసనం.. దాని కింది భాగం రక్తపు ధారలు” అనే పోస్టర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పూర్తిస్థాయి రాజకీయ నేపథ్యంలో ఉండబోతున్న ఈ చిత్రాన్ని కలాహి మీడియా నిర్మిస్తోంది. నూతన సంవత్సర కానుకగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు వెల్లడించబోతున్నారు. 2026 జనవరి 1న సాయంత్రం 5 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ టీజర్ విడుదల కానుంది. వరుస విజయాలతో 2026ని తన కెరీర్‌లోనే గోల్డెన్ ఇయర్‌గా మార్చుకోవాలని కంకణం కట్టుకున్న విశ్వక్ సేన్ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *