Allu Sirish: యంగ్ హీరో అల్లు శిరీష్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హోదాకు స్వస్తి పలుకుతూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన చిరకాల ప్రేయసి నయనిక రెడ్డితో కలిసి ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. తాజాగా ఈ వివాహ వేడుకకు సంబంధించిన తేదీని శిరీష్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
అల్లు శిరీష్ తన వివాహ తేదీని అత్యంత వినూత్నంగా, సరదాగా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో అల్లు అర్జున్ పిల్లలు అర్హ, అయాన్, అల్లు బాబీ కుమార్తె అన్వితతో కలిసి ఆయన సందడి చేశారు. “బాబాయ్ మీ పెళ్లి ఎప్పుడు?” అని పిల్లలు అడగగా.. 2026, మార్చి 6వ తేదీన తన వివాహం జరగబోతున్నట్లు శిరీష్ తెలిపారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సరిగ్గా ఇదే తేదీన అల్లు అర్జున్ – స్నేహా రెడ్డిల వివాహం కూడా జరిగింది. అన్న పెళ్లి రోజునే తమ్ముడు కూడా పెళ్లి పీటలెక్కడం విశేషం.
Also Read: Sudha Kongara: రజనీతో ప్రేమకథ.. సుధా కొంగర డ్రీమ్ ప్రాజెక్ట్
ఈ వివాహ వేడుకలో ‘సంగీత్’ వంటి కార్యక్రమాలు ఉండబోవని శిరీష్ స్పష్టం చేశారు. “మనం సౌత్ ఇండియన్స్.. మన సంప్రదాయంలో సంగీత్ లాంటివి ఉండవు” అని ఆయన ఈ వీడియోలో సరదాగా వ్యాఖ్యానించారు. కేవలం దక్షిణాది ఆచారాల ప్రకారం సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుకలు జరగనున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె అయిన నయనిక రెడ్డితో శిరీష్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అక్టోబర్ 31, 2025న వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెళ్లి తేదీ ప్రకటనకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
View this post on Instagram
