Crime News

Crime News: ప్రేమ ముసుగులో కామాంధుడి ‘డబుల్’ గేమ్.. అక్కాచెల్లెళ్లపై లైంగిక దోపిడీ

Crime News: మనుషుల మధ్య నమ్మకం రోజురోజుకూ దిగజారిపోతోంది. ముఖ్యంగా సహజీవనం (Live-in relation) పేరుతో జరుగుతున్న దారుణాలు సమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. తాజాగా సిలికాన్ సిటీ బెంగళూరులో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేస్తోంది. ప్రేమ పేరుతో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లను లైంగికంగా వాడుకోవడమే కాకుండా, లక్షలాది రూపాయలు కాజేసిన ఓ కిలేడీ వ్యక్తి ఉదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది.

మైనర్‌తో మొదలుపెట్టి.. అక్కను కూడా వదలకుండా..

ఉత్తరప్రదేశ్ లో 29 ఏళ్ల శుభం శుక్లా అనే వ్యక్తి తన వక్రబుద్ధిని నీలమంగళ ప్రాంతంలో మొదలుపెట్టాడు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, నిందితుడు మొదట ఒక మైనర్ బాలికతో స్నేహం చేసి, మెల్లగా ఆ కుటుంబంలో నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ఆ బాలికను లైంగికంగా లోబర్చుకున్న శుక్లా, అక్కడితో ఆగకుండా ఆమె అక్కపై కన్నేశాడు. ఆమెను కూడా ప్రేమ పేరుతో బుట్టలో వేసుకుని, సహజీవనం చేద్దామని నమ్మబలికాడు.

మూడేళ్ల మాయా లోకం.. రూ. 20 లక్షల దోపిడీ!

బాధితురాలిని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న నిందితుడు, ఆమె చేత ఇంట్లో అబద్ధాలు చెప్పించాడు. ఉద్యోగం నిమిత్తం ముంబై వెళ్తున్నానని తల్లిదండ్రులను నమ్మించిన సదరు మహిళ, గడిచిన మూడేళ్లుగా బెంగళూరులోనే శుక్లాతో కలిసి ఉంది.

ఇది కూడా చదవండి: Hyderabad: క్వేక్‌ ఎరీనా పబ్‌లో 8 మందికి డ్రగ్‌ పాజిటివ్‌

ఈ కాలంలోనే అసలు రంగు బయటపెట్టిన శుక్లా, పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ ఆమె వద్ద నుంచి ఏకంగా రూ. 20 లక్షల నగదు, సుమారు 200 గ్రాముల బంగారు ఆభరణాలను కాజేశాడు.

నిలదీస్తే చిత్రహింసలు.. చివరికి కటకటాల్లోకి!

శుభం శుక్లాకు అప్పటికే పెళ్లయిందన్న చేదు నిజం తెలుసుకున్న బాధితురాలు అతడిని నిలదీసింది. దానికి నిందితుడు పొంతన లేని సమాధానాలు చెబుతూ, తన భార్యకు విడాకులు ఇస్తానని నమ్మబలికాడు. అయితే అప్పటి నుండి ఆమెను శారీరకంగా, మానసికగా వేధించడం మొదలుపెట్టాడు. రోజురోజుకూ పెరిగిపోతున్న వేధింపులను తట్టుకోలేక, ఆమె చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుని బాగల్‌గుంటే పోలీసులను ఆశ్రయించింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శుభం శుక్లాను అరెస్ట్ చేశారు. ఇతడిపై మైనర్ బాలికను వేధించినందుకు పోక్సో (POCSO) చట్టంతో పాటు, లైంగిక దోపిడీ, మోసం, దొంగతనం కింద పలు సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *