Film Chamber Elections

Film Chamber Elections: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ప్రారంభం.. రెండు ప్యానెల్స్ మధ్య హోరాహోరీ

Film Chamber Elections:  తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు నేడు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఫిలింనగర్‌లోని ఛాంబర్ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచే సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా ‘మన ప్యానెల్’ మరియు ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. చిన్న నిర్మాతలు ఒక వర్గంగా, అగ్ర నిర్మాతలు మరో వర్గంగా విడిపోవడంతో ఈ ఎన్నికలు టాలీవుడ్‌లో ఉత్కంఠను రేపుతున్నాయి.

Also Read: Earthquake: తైవాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 7.0 తీవ్రతతో ప్రకంపనలు

ముఖ్యంగా ఈసారి ఎగ్జిబిటర్ల విభాగం నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉండటంతో, సురేష్ బాబు, నట్టి కుమార్ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. సురేష్ బాబు ప్యానెల్‌కు అల్లు అరవింద్, దిల్‌రాజు వంటి దిగ్గజాలు మద్దతు ఇస్తుండగా, నట్టి కుమార్ ప్యానెల్‌కు సి. కల్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు మద్దతుగా నిలిచారు. గిల్డ్ వ్యవహారాలు, చిన్న సినిమాల మనుగడ వంటి అంశాలే ఎజెండాగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం పోలింగ్ ముగిసిన తర్వాత, సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి, 6 గంటల కల్లా తుది ఫలితాలను ప్రకటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *