Telangana:పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో పోలీసులు తాజాగా చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ-1గా సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-11గా నటుడు అల్లు అర్జున్‌ను కేసు ఫైల్ చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు నిర్దారించారు.
Telangana:ఈ కేసులో నటుడు అల్లు అర్జున్‌తో పాటు 23 మందిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ మేనేర్, వ్యక్తిగత సిబ్బంది సహా 8 మంది బౌన్సర్లపైనా ఈ చార్జిషీట్‌లో నమోదు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ రేవతి (35) మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ (9) అపస్మారక స్థితిలో కోమాలో ఉండి ఇప్పటికీ చికిత్స పొందుతున్నాడు.
Telangana:2024 డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల సమయంలో పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్దకు ఆ సినిమా హీరో అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆయన రాకతో అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సమయంలోనే తొక్కిసలాట ఘటన చోటుచేసుకున్నది. ఈ ఘటనలో మరికొంత మంది గాయాలపాలయ్యారు.
