Sara Arjun: ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రయాణం ప్రారంభించిన సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్‌గా అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే రణవీర్ సింగ్ సరసన నటించి 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బ్లాక్‌బస్టర్‌లో భాగమైంది. ఈ విధంగా ఇండస్ట్రీ హిట్ హీరోయిన్‌గా రికార్డు నమోదు చేసింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన సారా అర్జున్, ఇప్పుడు టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఆమె తండ్రి రాజ్ అర్జున్ కూడా నటుడే. ఒకటిన్నర ఏళ్ల వయసులోనే తొలి టీవీ యాడ్‌లో నటించింది. 2011లో వచ్చిన తమిళ చిత్రం ‘దైవ తిరుమగల్’ తెలుగులో ‘నాన్న’గా డబ్బయింది. విక్రమ్ కూతురు పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. తమిళ డబ్బింగ్ సినిమా అయినా తెలుగులో విశేష గుర్తింపు సంపాదించింది. రాజేంద్రప్రసాద్ నటించిన ‘దాగుడుమూత దండాకోర్’లో మనవరాలిగా మెప్పించింది. మలయాళంలో ‘ఆన్ మరియా కలిప్పిలాను’తో ఫ్యాన్ బేస్ పెంచుకుంది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1 & 2’లో ఐశ్వర్యారాయ్ చిన్నతనం పాత్ర పోషించి హైలైట్ అయింది. ఇప్పుడు 20 ఏళ్ల వయసులో ‘ధురంధర్’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరో రణవీర్ సింగ్ సరసన నటించి, తొలి సినిమాతోనే 1000 కోట్ల బ్లాక్‌బస్టర్ సాధించిన హీరోయిన్ గా రికార్డు సృష్టించింది.
