Viral News: ప్రేమకు హద్దులు లేవంటారు.. కానీ ఈ జంట ఆ మాటను మరోస్థాయికి తీసుకెళ్లింది. సోషల్ మీడియా పరిచయం కాస్తా పెళ్లికి దారితీసింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. వివాహం చేసుకున్న ఇద్దరూ యువతులే కావడం! బిహార్‌లోని సుపాల్ జిల్లాలో జరిగిన ఈ ‘స్పెషల్ మ్యారేజ్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన బంధం
సుపాల్ జిల్లాకు చెందిన పూజా గుప్తా (21), కాజల్ కుమారి (18)లకు రెండేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరిచయం ఏర్పడింది. తొలుత చాటింగ్, ఆపై ఫోన్ కాల్స్‌తో మొదలైన వీరి స్నేహం.. కాలక్రమేణా గాఢమైన ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని గ్రహించిన ఈ యువతులు, తమ ప్రేమను గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారు.
కలిసి ఉండటం కోసం పక్కా ప్లాన్
తమ ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించేందుకు వీరిద్దరూ తెలివిగా వ్యవహరించారు. త్రివేణిగంజ్‌లోని ఒకే షాపింగ్ మాల్‌లో ఉద్యోగాల్లో చేరారు. ఇంటి నుంచి బయటకు వచ్చి, మాల్‌కు సమీపంలోనే ఒక గదిని అద్దెకు తీసుకుని సహజీవనం (Live-in) ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Bangladesh: బంగ్లాలో ఉద్రిక్తతలు.. రాక్‌స్టార్ కాన్సర్ట్‌పై మూక దాడి..!
గుడిలో పెళ్లి.. గ్యాస్ స్టవ్వే సాక్షి!
డిసెంబర్ 23వ తేదీ అర్ధరాత్రి ఈ కథలో అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది. వీరి వివాహం అత్యంత విభిన్నంగా జరిగింది:
త్రివేణిగంజ్ మేళా గ్రౌండ్‌లోని కాళీమాత ఆలయం. పూజా గుప్తా వరుడిలా డ్రెస్ వేసుకోగా, కాజల్ వధువులా ముస్తాబైంది. ఆలయంలో హోమం లేకపోవడంతో, తాము తెచ్చుకున్న గ్యాస్ స్టవ్ వెలిగించి, దాని చుట్టూ ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. పూజా, కాజల్ నుదుట సిందూరం దిద్ది దండలు మార్చుకుంది. ఈ వేడుకకు పూజారి గానీ, బంధువులు గానీ సాక్ష్యం లేరు.
అబ్బాయిలు వద్దు.. మేమే ముద్దు!
పెళ్లి తర్వాత వీరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు, స్థానికులు ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆ యువతులు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మాకు అబ్బాయిలపై ఆసక్తి లేదు. పరస్పర అంగీకారంతోనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. చనిపోయే వరకు ఇద్దరం కలిసే ఉంటాం” అని ధీమాగా చెబుతున్నారు.
