Subhalekha Sudhakar: కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘శుభలేఖ’ చిత్రంతో నటునిగా పరిచయం అయిన సుధాకర్ ఆ సినిమా టైటిల్ నే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఆ తరువాత అనేక చిత్రాలలో కామెడీతో కబడ్డీ ఆడేసిన సుధాకర్, పలు చిత్రాలలో కీలక పాత్రల్లో అలరించారు. కొన్ని సినిమాల్లో విలన్ గానూ మెప్పించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో అలరిస్తూనే ఉన్న శుభలేఖ సుధాకర్ నవంబర్ 19న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వైవిధ్యాన్నే నమ్ముకొని సాగుతున్న సుధాకర్ అప్పట్లో గాయని యస్పీ శైలజను ప్రేమించి పెళ్ళాడారు. భార్యాభర్తలిద్దరూ చిత్రసీమలోనే రాణించారు. రాబోయే రోజుల్లో శుభలేఖ సుధాకర్ మరిన్ని విలక్షణమైన పాత్రల్లో అలరిస్తారని ఆశిద్దాం.

