Russia:

Russia: చంద్రుడిపై అన్వేష‌ణ‌లో ర‌ష్యా మ‌రో ముంద‌డుగు

Russia: ప్ర‌పంచవ్యాప్తంగా ప‌లు దేశాలు చంద్ర‌మండ‌లంపై ప‌రిశోధ‌న‌ల‌ను మ‌రింత వేగ‌వంతం చేస్తున్నాయి. త‌మ అన్వేష‌ణ‌లో భాగంగా ఆయా దేశాలు కీల‌క ప్రాజెక్టుల‌ను అమ‌లు చేస్తున్నాయి. ఇప్ప‌టికే చంద్ర‌మండ‌ల ప‌రిశోధ‌న‌ల్లో ప్ర‌ముఖ దేశాల్లో ఒక‌టైన ర‌ష్యా దేశం మ‌రో కీల‌క అడుగు వేసేందుకు సిద్ధ‌మైంది. రాబోయే ప‌దేళ్ల‌లో చంద్రుడిపై విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌న్న ల‌క్ష్యంతో ప్లాన్ చేస్తున్న‌ది. త‌మ దేశానికి చెందిన లూనార్ అంత‌రిక్ష ప‌రిశోధ‌నకు, ర‌ష్యా-చైనా సంయుక్త ప‌రిశోధ‌నా కేంద్రానికి కూడా నిరంత‌ర క‌రెంటు స‌ర‌ఫ‌రా చేయ‌డ‌మే ఈ ప్రాజెక్టు ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని ర‌ష్యా దేశం తాజాగా ప్ర‌క‌టించింది.

Russia: 2036 నాటికి అంటే ప‌ది సంవ‌త్స‌రాల్లో చంద్రుడిపై విద్యుత్ ప్లాంట్ ఏర్పాటే ధ్యేయంగా పెట్టుకున్న‌ట్టు ర‌ష్యా ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ రోస్కోస్మోస్ వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఏరోస్పేస్ సంస్థ లావోచ్‌కిన్‌తో ఒప్పందం చేసుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది. చంద్రుడి ఉప‌రిత‌లంపై ప‌నిచేసే రోవ‌ర్లు, ప‌రిశీల‌నా కేంద్రాలు, ర‌ష్యా-చైనా స‌యుంక్త ప‌రిశోధ‌నా కేంద్రం, ర‌ష్యా దేశ లూనార్ ప్రోగ్రామ్‌కు అవ‌స‌ర‌మైన విద్యుత్తును ఆ కేంద్రం నుంచే అందించ‌నున్న‌ట్టు తెలిపారు. అయితే ఇది అణు విద్యుత్ కేంద్రం కావ‌చ్చ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ర‌ష్యా మాత్రం అధికారికంగా వెలువ‌రించ‌లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *