Rushikonda Palace

Rushikonda Palace: ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!.. టూరిజం హబ్‌గా రుషికొండ ప్యాలెస్‌?

Rushikonda Palace: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన రుషికొండ భవనాల భవితవ్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రజాధనంతో నిర్మించిన ఈ విలాసవంతమైన ప్యాలెస్‌ను కేవలం ప్రభుత్వ అవసరాలకే పరిమితం చేయకుండా, రాష్ట్రానికి ఆదాయం తెచ్చేలా  ‘ప్రీమియం టూరిజం ప్రాజెక్ట్‌’గా మార్చాలని కూటమి సర్కార్ నిర్ణయించింది.

హాస్పిటాలిటీ దిగ్గజాలతో చర్చలు

రుషికొండ ప్యాలెస్‌ను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు హాస్పిటాలిటీ రంగంలోని అగ్రగామి సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఈ జాబితాలో ప్రధానంగా:

  • టాటా గ్రూప్ (Taj Hotels)

  • లీలా గ్రూప్

  • అట్మాస్ఫియర్ కోర్

  • ఫెమా గ్రూప్

ఈ దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో ప్యాలెస్‌ను లగ్జరీ రిసార్ట్‌గా మార్చడం ద్వారా పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా, ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

సబ్ కమిటీ కీలక నిర్ణయాలు

మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం మూడోసారి సమావేశమై కీలక అంశాలపై చర్చించింది:

వైట్ ఎలిఫెంట్‌గా మారిన ప్యాలెస్: గత ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చే రిసార్ట్స్‌ను కూల్చివేసి, ఈ ప్యాలెస్ నిర్మించడం వల్ల ప్రస్తుతం పర్యాటక శాఖపై నెలకు రూ. 25 లక్షల నిర్వహణ భారం పడుతోందని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

CRZ నిబంధనల సవాలు: మొత్తం 9 ఎకరాల భూమిలో సీఆర్‌జెడ్ (CRZ) నిబంధనల ప్రకారం 7 ఎకరాలు నిర్మాణాలకు అనర్హం. మిగిలిన 2 ఎకరాల్లో ఉన్న భవనాలను హోటల్ అవసరాలకు అనుగుణంగా ఎలా మార్చాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Pragathi: పతకాలు పవర్ లిఫ్టింగ్‌వా? పూజలవా? వేణుస్వామి వ్యాఖ్యలపై నటి ప్రగతి ‘పవర్ ఫుల్’ కౌంటర్!

ఆర్ట్ గ్యాలరీ & కల్చరల్ హబ్: ప్యాలెస్‌లోని చివరి రెండు బ్లాక్‌లను ఆర్ట్ గ్యాలరీలు, సాంస్కృతిక ప్రదర్శనలకు కేటాయించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు.

మాల్దీవుల తరహా అభివృద్ధి: విశాఖ బీచ్ ఫ్రంట్‌ను మాల్దీవులు లేదా పుదుచ్చేరి తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

ప్రజాధనంతో నిర్మించిన ఈ ఆస్తులు వృధా కాకూడదు. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో అత్యుత్తమ వయబుల్ మోడల్‌తో ముందుకు వెళ్ళనున్నాం అని  ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు 

తదుపరి కార్యాచరణ ఇదే!

ఈ ప్రాజెక్టుపై తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది:

  • డిసెంబర్ 28: మంత్రివర్గ ఉపసంఘం (GoM) మరోసారి సమావేశమై ప్రతిపాదనలను ఖరారు చేస్తుంది.

  • డిసెంబర్ 29: రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించి అధికారిక ముద్ర వేయనున్నారు.

విశాఖ బ్యూటీకి ఈ ‘ప్యాలెస్ టూరిజం’ తోడైతే, ఏపీ పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *