Harish Rao: మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. తమకు ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు రాసిపెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా లెక్క తేలుస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోందన్నారు.
బతుకమ్మ పండుగకు సంబంధించి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని విమర్శించిన హరీష్‌రావు.. సగం మందికీ కూడా బతుకమ్మ చీరలు అందలేదని తెలిపారు. మహిళల పట్ల కాంగ్రెస్ వైఖరి ఇదేనా అని ప్రశ్నించారు.ప్రజల ఆకాంక్షలను విస్మరిస్తున్న కాంగ్రెస్‌కు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.
