Rowdy Janardhana: విజయ్ దేవరకొండ కెరీర్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు యూత్‌ఫుల్ ఇమేజ్‌తో మెప్పించిన ఈ హీరో తొలిసారి పూర్తి మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ‘రౌడీ జనార్థన’ టైటిల్ గ్లింప్స్ హైదరాబాద్‌లో అభిమానుల మధ్య విడుదలైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: Singer Chinmayi: ‘డ్రెస్సింగ్’ చిచ్చు.. టాలీవుడ్‌లో మొదలైన మాటల యుద్ధం!
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రౌడీ జనార్థన’. దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామాకు టైటిల్ గ్లింప్స్‌ను అభిమానుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. కథ వినగానే విజయ్ దేవరకొండ పాత్రను ఒప్పుకున్నారని దర్శకుడు తెలిపారు. ఈస్ట్ గోదావరి యాసలో ఆయన డైలాగ్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని పేర్కొన్నారు. టైటిల్ గ్లింప్స్ కేవలం ట్రైలర్ మాత్రమేనని, ముందు మరింత బలమైన కంటెంట్ రానుందని చెప్పారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఇప్పటివరకు యూత్‌ఫుల్ పాత్రలతో మెప్పించిన విజయ్ ఈ చిత్రంలో రగ్డ్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారని తెలిపారు. ఆ మాస్ ట్రీట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. 80వ దశకం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ డినో శంకర్, డీవోపీ ఆనంద్ సి చంద్రన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
