The Paradise: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా అంటేనే ఒక కొత్త ఎక్స్‌పెరిమెంట్. ముఖ్యంగా ‘దసరా’ తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండటంతో, వీరి కొత్త ప్రాజెక్ట్ ‘ద పారడైజ్’ పై ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ నెలకొంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సిన ఒక స్టార్ కిడ్ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
నో చెప్పిన ‘దేవర’ బ్యూటీ
అతిలోక సుందరి వారసురాలిగా ‘దేవర’ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న జాన్వీ కపూర్, ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ‘ద పారడైజ్’ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ ముందుగా జాన్వీనే సంప్రదించారు. నాని పక్కన ఆమె జోడీ కుదిరితే సినిమాకు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ వస్తుందని భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. కానీ, అనూహ్యంగా జాన్వీ ఈ ప్రాజెక్టుకు నో చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
కారణం: కాల్ షీట్ల కష్టాలేనా?
జాన్వీ ఈ సినిమాను తిరస్కరించడానికి కథ నచ్చకపోవడం కారణం కాదు, కేవలం సమయం లేకపోవడమే అని ఇండస్ట్రీ టాక్. ఆమె డైరీ ప్రస్తుతం ఎలా ఉందంటే. రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కుతున్న #RC16 పెది సినిమాలో ఆమె నటిస్తోంది. ఇంకో వైపు బాలీవుడ్ లోను వరుణ్ ధావన్ సరసన నటిస్తున్న సినిమాతో పాటు మరికొన్ని హిందీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఒకేసారి రెండు మూడు భారీ సినిమాల షూటింగ్స్ జరుగుతుండటంతో, నాని సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయడం ఆమెకు సాధ్యం కాలేదట.
ఇది కూడా చదవండి: Sridharbabu: రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు.. 1.40 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు
నిరాశలో అభిమానులు.. నెక్స్ట్ ఎవరు?
నాని నేచురాలిటీ, జాన్వీ గ్లామర్ కలిస్తే స్క్రీన్ మీద మ్యాజిక్ జరుగుతుందని ఆశించిన అభిమానులకు ఇది ఒక రకంగా చేదు వార్తే. కథ డిమాండ్ మేరకు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందట. ఇప్పుడు జాన్వీ తప్పుకోవడంతో, మేకర్స్ మళ్ళీ మొదటి నుంచి హీరోయిన్ వేట మొదలుపెట్టారు.
శ్రీకాంత్ ఓదెల మార్క్ మాస్ ఎంటర్టైనర్‌లో నాని సరసన మెరిసే ఆ లక్కీ భామ ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. నాని – జాన్వీ కాంబో ఈసారికి మిస్ అయినా, భవిష్యత్తులో ఏదైనా బిగ్ ప్రాజెక్టులో వీరు కలిసే అవకాశం ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
