Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 638 పాయింట్ల లాభంతో 85,567 వద్ద, నిఫ్టీ 206 పాయింట్ల లాభంతో 26,172 వద్ద స్థిరపడింది. ఈ స్థిరమైన పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండడం, రూపాయి బలపడడం, భవిష్యత్తులో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అంచనాలు కారణమయ్యాయి. ఇండియా-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన వార్త కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదపడింది.
Also Read: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో విద్యార్థి నాయకుడిపై కాల్పులు..!
టాప్ గెయినర్స్‌లో క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్, జూపిటర్ వ్యాగన్స్, ష్రెనిక్, ఐడియాఫోర్జ్ టెక్నాలజీ, సద్భావ్ ఇంజనీరింగ్ ప్రధానంగా నిలిచాయి. మరోవైపు నాలెడ్జ్ మెరైన్ & ఇంజనీరింగ్, దావణగెరె షుగర్, ఆర్వీ లాబొరేటరీస్, మీషో, రిలయన్స్ పవర్ నష్టాల జాబితాలో చోటు చేసుకున్నాయి.
సెన్సెక్స్‌లో ట్రెంట్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ షేర్లు లాభపడ్డాయి. బ్యాంక్, ఫైనాన్స్ రంగంలో మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ 61.20 డాలర్ల వద్ద, బంగారం 4,411 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజు వరుసగా పాజిటివ్ ట్రెండ్‌లో ముగిశాయి.
