Lenin

Lenin: అఖిల్ ‘లెనిన్’ షూటింగ్ పూర్తి!

Lenin: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం నుంచి తాజా అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌లో తన పాత్ర పూర్తి చేసినట్లు అఖిల్ తెలిపారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగుతోంది.

Also Read: Brahmanandam: ముర్ముకు బ్రహ్మానందం స్పెషల్ గిఫ్ట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా అఖిల్ తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేశారు. అయితే ప్యాచ్ వర్క్ కోసం వచ్చే నెలలో మళ్లీ సెట్స్‌కు రావాల్సి ఉంటుంది. ఈ సినిమా చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట శ్రీలీల ఎంపికై, తరువాత ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. అఖిల్ – భాగ్యశ్రీ జంటగా కనిపించే లవ్ సీన్స్ ఆకట్టుకునేలా ఉంటాయని టాక్. అఖిల్ ఈ చిత్రంపై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. టీమ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం సినిమా అవుట్‌పుట్ బాగుంది. శరవేగంగా సినిమా సిద్ధమవుతోంది. ఈ చిత్రంతో అఖిల్ కెరీర్‌లో హిట్ సాధిస్తారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *