Biggboss: బిగ్ బాస్ విన్నర్ ఇదిగో.. చెప్పేసిన వికీపీడియా

Biggboss: తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. కేవలం ఒక్క రోజులోనే గ్రాండ్ ఫినాలే జరగనుండగా, ప్రేక్షకుల్లో ఉత్కంఠ పీక్స్‌కి చేరింది. ఈ సీజన్ మొత్తం డ్రామా, ఎమోషన్స్, అనూహ్య ట్విస్టులు, షాకింగ్ ఎలిమినేషన్లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇలాంటి సమయంలో బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరు? అన్న చర్చ రోజురోజుకీ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వార్త భారీగా వైరల్ అవుతోంది. అధికారిక ప్రకటనకు ముందే వికీపీడియాలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేత వివరాలు అప్‌డేట్ కావడం కలకలం రేపుతోంది.

వికీపీడియాలో దర్శనమిచ్చిన సమాచారం ప్రకారం, కళ్యాణ్ విజేతగా, తనూజ రన్నరప్‌గా నిలిచినట్లు పేర్కొనడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే వికీపీడియా ఒక ఓపెన్ సోర్స్ వేదిక కావడంతో, ఎవరైనా కావాలనే ఈ వివరాలను ముందుగానే సవరించి ఉండొచ్చని భావిస్తున్నారు. బిగ్ బాస్ యాజమాన్యానికి లేదా షో నిర్వాహకులకు వికీపీడియాతో ఎలాంటి అధికారిక సంబంధం లేదని తెలుస్తోంది

అయినప్పటికీ, అధికారిక ప్రకటనకు ముందే ఇలా విన్నర్ పేరు బయటకు రావడంతో సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. కొందరు ఇది నిజమేనని నమ్ముతుండగా, మరికొందరు మాత్రం ఇది కేవలం ఫేక్ అప్‌డేట్ అని అభిప్రాయపడుతున్నారు.

అసలు నిజం ఏంటో తెలియాలంటే మాత్రం, హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఫినాలే వేదికపై అధికారికంగా ప్రకటించే వరకూ వేచి చూడాల్సిందే. అప్పటివరకూ బిగ్ బాస్ అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగడం ఖాయం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *