Akhanda 2

Akhanda 2: వారణాసిలో కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న ‘అఖండ-2’ టీమ్‌..!

Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ‘అఖండ-2’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం సాధిస్తున్న అఖండ విజయం పట్ల కృతజ్ఞతలు తెలుపుకోవడానికి చిత్ర బృందం శుక్రవారం ఆధ్యాత్మిక నగరమైన వారణాసిని సందర్శించింది. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాతలు కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగా హారతిలో పాల్గొన్న చిత్ర యూనిట్‌ను చూసేందుకు స్థానిక అభిమానులు భారీగా తరలివచ్చారు.

వారణాసి పర్యటనలో భాగంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి తరం యువత మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఈ సినిమాలో తాను ఒక ‘సనాతన సైనికుడి’ పాత్రలో నటించానని, ఆ పాత్ర తనకు ఎనలేని ఆత్మసంతృప్తిని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ‘అఖండ-2’ కేవలం ఒక ప్రాంతీయ సినిమా మాత్రమే కాదని, భారతీయ మూలాలను ప్రతిబింబించే జాతీయ చిత్రమని ఆయన అభివర్ణించారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఈ చిత్ర ఇతివృత్తం, అందులోని ఆధ్యాత్మిక అంశాలు ఎంతో నచ్చాయని బాలయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Also Read: Dhurandhar: ధురంధర్ ఓటీటీ డీల్‌కు షాకింగ్ ధర?

డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, తొలి రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. బాలయ్య అఘోర లుక్, పవర్‌ఫుల్ డైలాగ్స్ మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుండగా, ఎస్.ఎస్. థమన్ అందించిన నేపథ్య సంగీతం థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్ర, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించారు. కథలో ఆధ్యాత్మికత, సామాజిక సందేశం కలగలిసి ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *