iBomma Ravi

iBomma Ravi: ఐబొమ్మ ఇమ్మడి రవికి మరోసారి పోలీస్ కస్టడీ

iBomma Ravi:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవిని మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి జిల్లా కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రెండుసార్లు కలిపి ఎనిమిది రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు, మిగిలిన మూడు కేసుల్లో కూడా రవిని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.

పోలీసుల అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం, ఒక్కో కేసులో నాలుగు రోజుల చొప్పున మొత్తం పన్నెండు (12) రోజుల పాటు విచారించడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నాంపల్లి కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

రేపటి నుంచి విచారణ:
కోర్టు ఆదేశాల ప్రకారం, సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల 18వ తేదీ (రేపటి) నుంచి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఇమ్మడి రవిని తమ కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు.

Also Read: Telangana: తెలంగాణలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం!

రవిపై నమోదైన కేసులు
ఐబొమ్మ రవిపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐటీ చట్టం, కాపీరైట్ చట్టం కింద కేసులు ఉండగా, వీటితో పాటు మనీ లాండరింగ్ (అక్రమ డబ్బు చలామణి), విదేశీయుల చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.

ఇప్పటికే రెండు కేసుల్లో రవిని కస్టడీకి తీసుకుని పోలీసులు ఎనిమిది రోజులు విచారించారు. తాజాగా మూడు కేసుల్లో 12 రోజుల కస్టడీకి అనుమతి లభించింది. మిగిలిన ఒక కేసులో కస్టడీకి సంబంధించిన తీర్పును న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది.

గత విచారణలలో పోలీసులు పలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. తాజాగా 12 రోజుల కస్టడీలో మిగిలిన మూడు కేసులకు సంబంధించి, ముఖ్యంగా మనీ లాండరింగ్, విదేశీ లావాదేవీల గురించి మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *