Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో లూథ్రా బ్రదర్స్ అరెస్ట్… గోవాకు తరలించనున్న పోలీసులు

Delhi: గోవా నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి నిందితులుగా ఉన్న లూథ్రా బ్రదర్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పది రోజుల తర్వాత థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు వచ్చిన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే గోవా పోలీసులు అరెస్ట్ చేశారు.

అగ్నిప్రమాదం అనంతరం థాయ్‌లాండ్‌కు పారిపోయిన నిందితులుగా వీరిపై ఆరోపణలు ఉన్నాయి. విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన అనంతరం, లూథ్రా బ్రదర్స్‌ను ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి గోవాకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

గోవా నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో, ఈ కేసులో దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. నిందితులను గోవాకు తరలించిన తర్వాత పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *