Upasana Konidela

Upasana Konidela: మెగా ఇంట మరో గుడ్ న్యూస్?

Upasana Konidela: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌, ఉపాసన దంపతుల ఇంట మరోసారి శుభవార్త వినిపిస్తోంది. ఇటీవ‌ల ఓ వీడియో షేర్ చేయ‌గా ఇందులో దీపావళి సంబరాలతో పాటు ఉపాసనకు సీమంతం నిర్వహించిన దృశ్యాలు కూడా కనిపించడంతో ఆమె మరోసారి గర్భం దాల్చిందన్న వార్తలు బలంగా వినిపించాయి. ముఖ్యంగా “డబుల్” అనే పదాన్ని పదే పదే వాడటంతో ఈసారి కవలలు పుట్టబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అది నిజ‌మే అనే విష‌యాన్ని ఉపాస‌న కూడా క‌న్‌ఫాం చేసింది. త్వ‌ర‌లో ఉపాస‌నకి క‌వ‌ల‌లు జ‌న్మించ‌బోతున్నారు.

ఇక రామ్‌చరణ్‌, ఉపాసనలకు 2012లో వివాహం కాగా… 2023 జూన్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు ‘క్లీంకార’ అని నామకరణం చేశారు. ఇప్పటివరకు క్లీంకార ముఖాన్ని ఫ్యామిలీ రివీల్ చేయలేదు. తాజాగా ఉపాసన మరోసారి గర్భం దాల్చినట్లు హింట్ ఇవ్వడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈసారి ‘సింబా’ వస్తాడంటూ కొందరు కామెంట్లు చేసారు. కాగా గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక కార్యక్రమంలో తనకు మనవడు పుట్టాలని కోరికగా ఉందని చెప్పిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: Raju Weds Rambai OTT: ఎక్స్టెండెడ్ కట్ తో రానున్న రాజు వెడ్స్ రాంబాయి.. రిలీజ్ డేట్ ఫిక్స్

ఇక గతంలో ఉపాసన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెండో సంతానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మొదటి బిడ్డ విషయంలో చాలా ఆలస్యం చేశాం. అప్పట్లో వచ్చిన విమర్శలు, ఒత్తిడిని పట్టించుకోలేదు. కానీ రెండో బిడ్డ విషయంలో అలా చేయాలనుకోవడం లేదు అని చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ఉపాస‌న ప్ర‌గ్నెంట్ కాగా, వ‌చ్చే ఏడాది క‌వ‌ల‌ల‌కి జ‌న్మ‌నివ్వ‌నుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *