Raju Weds Rambai OTT

Raju Weds Rambai OTT: ఎక్స్టెండెడ్ కట్ తో రానున్న రాజు వెడ్స్ రాంబాయి.. రిలీజ్ డేట్ ఫిక్స్

Raju Weds Rambai OTT: చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ముందు నుంచే సినిమా క్లైమాక్స్ గురించి హైప్ క్రియేట్ చేసిన సినిమా టీమ్ ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధించారు అని చెప్పవచ్చు. ఈ సినిమాను కొత్త దర్శకుడు సాయి కంపాటి తెరకెక్కించాడు. ఈ సినిమాను ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్‌ ఫిల్మ్స్‌, మాన్సూన్‌ టేల్స్‌ బ్యానర్‌లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి కలిసి సంయుక్తంగా నిర్మించారు.

అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో హీరోయిన్లుగా నటించారు. సినిమాలో ముఖ్యపాత్రలో హీరోయిన్‌కు తండ్రిగా సిద్ధూ జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ నటించాడు. ఇప్పుడు ఈ సినిమా OTTలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

ఇది కూడా చదవండి: Ranji Trophy: దేశవాళీ క్రికెట్‌లో కొత్త శకం: రంజీ ఆడాల్సిందే!

సినిమాను నిర్మించిన ఈటీవీ విన్ ఒరిజినల్స్, తమ సొంత యాప్ ఈటీవీ విన్‌లోనే స్ట్రీమింగ్ కానున్నట్లు ట్విట్టర్ వేదికగా డిసెంబర్ 18 నుండి స్ట్రీమింగ్ అవనున్నట్లు తెలిపింది. ‘థియేటర్స్‌లో మోత మోగించాం.. ఇప్పుడు మీ ఇంట్లో కూడా మోత మోగించడానికి వస్తున్నాం, డాల్బీ అట్మాస్ సౌండ్‌ మరియు విజన్తో’ అని పోస్ట్‌ కింద క్యాప్షన్‌ జత చేశారు.

ప్రేక్షకులకు మరో సర్ప్రైజ్ విషయం కూడా తెలిపింది – రాజు వెడ్స్ రాంబాయి ఎక్స్‌టెండెడ్ కట్‌ను OTTలోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 2 గంటల 15 నిమిషాల నిడివితో థియేటర్‌లో రిలీజ్ చేశారు. ఇప్పుడు దీనికి కొన్ని సన్నివేశాలు యాడ్ చేసి ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను తీసుకుని రానున్నారు. రూ. 99 కే టికెట్ ప్రైస్ పెట్టి కొత్త ట్రెండ్ సెట్ చేసి థియేటర్‌లో ఘన విజయం సాధించిన రాజు వెడ్స్ రాంబాయి, OTTలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *