RowdyJanardhana

RowdyJanardhana: దిల్ రాజు బర్త్ డే స్పెషల్.. రౌడీ జనార్దన్ టీజర్ రిలీజ్

RowdyJanardhana: విజయ్ దేవరకొండ కొంతకాలం గా కలం కలిసి రావడం లేదు చేసిన ప్రతి సినిమా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్నాయి. ఈసారి యంగ్ టాలెంట్ కి అవకాశం ఇచ్చాడు. వరసగా రెండు సినిమాలు చేస్తున్నాడు. రాజా వారు రాణి వారు డైరెక్టర్ రవి కిరణ్ కోలా తో రౌడీ జనార్దన్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ మరో సినిమా చేస్తున్నాడు.

రాహుల్ సంకృత్యన్ కి హెవీ VFX వర్క్ ఉండటంతో ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ టైంని రౌడీ జనార్దన్ సినిమాకి ఇచ్చాడు. శరవేగంగా సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో చిత్ర బృందం ఓ అప్డేట్ ఇచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 18న సినిమా టైటిల్ రివీల్ ఇంకా సినిమా టీజర్ ప్రసాద్స్ లో విడుదల చేయనున్నాడు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: AMB Cinemas: మహేష్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆలస్యం కానున్న ఏఎంబీ సినిమాస్ ఓపెనింగ్

దిల్ రాజు 55 బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ లాంచ్ చేయనున్నారు. అక్టోబర్ నుండి మొదలైన సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. వచ్చే సంవత్సరం 2026 దసరా కి సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

జనవరి నుండి వరసగా నాలుగు నెలలు ఈ సినిమాకే డేట్ ఇవ్వనున్నారు విజయ్. ఈ సినిమాని శిరీష్ తో కలిసి దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంకా ముఖ్యపాత్రలు చేసేవారి పేర్లు బయటికి చెప్పలేదు. సందర్భాన్ని బట్టి ఒక్కోరి వివరాలు తెలపనున్నారు సినిమా టీమ్. మలయాళ సినిమాల్లో తనకంటూ ఒక్క పేరు ఫ్యాన్స్ ని సంపాదించుకున్న క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్నారు. ఆనంద్ సి. చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *