Hyderabad: హైదరాబాద్ నగరంలో రోజుకో దారుణం చోటుచేసుకుంటున్నది. సోమవారం జరిగిన మరో ఘటనలో బాలిక దారుణ హత్యకు గురైంది. మియాపూర్ టేక్ అంజయ్యనగర్‌కు చెందిన ఓ 17 ఏండ్ల యువతి ఈ నెల 8న అదృశ్యమైంది. తాజాగా తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో మైనర్ డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. లైంగికదాడి చేసి, హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ బాలికకు ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన ఉప్పుగూడకు చెందిన యువకుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
