Road Accident: హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక్కరు మృతి చెందగా ఇంకొకరికి త్రీవ్రగాయాలు అయ్యాయి. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి చెందగా తన త్రండ్రికి తీవ్రంగా గాయపడ్డారు.
మృతురాలిని మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చివరి సంవత్సరం వైద్య విద్యార్థిని యెంసాని ఐశ్వర్యగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హయత్‌నగర్‌లోని ఆర్టీసీ కాలనీ సమీపంలో ఐశ్వర్య తన తండ్రి పాండుతో కలిసి రోడ్డు దాటుతుండగా, వేగంగా వస్తున్న కారు వారిపైకి దూసుకెళ్లింది.
ఇది కూడా చదవండి: M. S. Subbulakshmi: ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం..?
ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఐశ్వర్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తీవ్ర గాయాలపాలైన ఆమె తండ్రిని మెరుగైన చికిత్స కోసం మరొక ఆసుపత్రికి తరలించారు.
మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి పంపారు. హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆక్సిడెంట్ చేసిన కారును కనిపెటే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
