Bigg Boss 9 Telugu: సెప్టెంబర్ 7న అట్టహాసంగా మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్-9 చివరి దశకి చేరుకుంది. ఎన్నో ఆసక్తికరమైన మలుపులు, అనూహ్యమైన ఎలిమినేషన్లతో సాగిన ఈ రియాలిటీ షో త్వరలోనే ముగియనుంది. ఈ సీజన్ విజేత ఎవరనే ఉత్కంఠకు తెర దించుతూ డిసెంబర్ 21న గ్రాండ్ ఫినాలే జరగనుంది.
ఈ వారం జరిగిన కీలకమైన చివరి ఎలిమినేషన్ ప్రక్రియతో హౌస్‌లో టాప్-5 కంటెస్టెంట్‌లు ఖరారయ్యారు. డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్‌తో మేకర్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. శనివారం (డిసెంబర్ 13) ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా, ఆదివారం ఎపిసోడ్‌లో రీఎంట్రీ ఇచ్చిన భరణి కూడా బయటకు వచ్చేశారు.
కప్ రేసులో టాప్-5 వీరే!
తాజా ఎలిమినేషన్ ప్రక్రియ అనంతరం, బిగ్ బాస్ సీజన్-9 ట్రోఫీ కోసం పోటీ పడుతున్న టాప్-5 కంటెస్టెంట్స్ వీలే.. తనూజ, కల్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్, సంజన గల్రానీ ఉన్నారు. ఈ ఐదుగురిలో ఒకరు డిసెంబర్ 21న బిగ్ బాస్ ట్రోఫీని ముద్దాడనున్నారు.
ఇది కూడా చదవండి: Cricket: కుప్పకూలిన సౌత్ ఆఫ్రికా..
విజేత ప్రైజ్ మనీ ఎంతంటే?
గ్రాండ్ ఫినాలే సందర్భంగా హోస్ట్ నాగార్జున ఈ సీజన్ విజేతకు అందించే ప్రైజ్ మనీని అధికారికంగా ప్రకటించారు. గత సీజన్ల మాదిరిగానే, ఈ సీజన్ విన్నర్‌కు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ లభిస్తుందని నాగ్ రివీల్ చేశారు. అయితే, రన్నరప్‌కు, అలాగే టాప్-5లో నిలిచిన మిగిలిన కంటెస్టెంట్‌లకు ఎంతెంత మొత్తం దక్కుతుందనేది మాత్రం వెల్లడించలేదు. ప్రైజ్ మనీతో పాటు, విజేతలకు స్పాన్సర్ కంపెనీలు అందించే లగ్జరీ కార్లు, గోల్డ్ ఛైన్స్ వంటి ఇతర నగదు కానుకలు కూడా లభించే అవకాశం ఉంది.
విజేతకు లభించే ప్రైజ్ మనీలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యాక్సుల రూపంలో భారీ మొత్తంలో కోత పడుతుందన్న విషయం తెలిసిందే.
అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న భరణి
ఈ సీజన్‌లో ఎక్కువ పేరున్న సెలబ్రిటీగా ఎంట్రీ ఇచ్చిన భరణి రెమ్యునరేషన్ పరంగా భారీ రికార్డు సృష్టించారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్‌గా ఆయన నిలిచారు.
- వారానికి పారితోషికం: రూ. 3.5 లక్షలు పైగానే.
- మొదటి దశ: ఆరో వారంలో ఎలిమినేట్ కావడంతో 6 వారాలకు గాను రూ. 21 లక్షలకు పైగా అందుకున్నారు.
- రీఎంట్రీ: 8వ వారంలో మళ్లీ హౌస్‌లోకి అడుగుపెట్టి మరో ఆరు వారాల పాటు కొనసాగారు. ఈ ఆరు వారాలకు కూడా అదే లెక్కన రూ. 21 లక్షలు లభించాయి.
- మొత్తం రెమ్యునరేషన్: రెండు విడతల్లో కలిపి భరణి సుమారు రూ. 42 లక్షల వరకు పారితోషికంగా అందుకున్నట్లు సమాచారం.
ఈ సీజన్‌లో మరే కంటెస్టెంట్ కూడా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. ఫినాలేకు ఇంకా కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో, విజేత ఎవరో తెలుసుకోవాలనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. ఈ ఐదుగురిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఎవరు కప్పు గెలవాలని మీరు కోరుకుంటున్నారు?
