PM Modi

PM Modi: ‘ది సబర్మతి రిపోర్ట్ కు ప్రధాని మోదీ ప్రశంసలు!

PM Modi: 2002 ఫిబ్రవరి 27న గోద్రాలో జరిగిన సబర్మతీ ఎక్స్ ప్రెస్ దహనం సంఘటన నేపథ్యంలో తెరకెక్కింది ‘ది సబర్మతీ రిపోర్ట్’ మూవీ. గత శుక్రవారం విడుదలై ఈ సినిమాకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. శుక్రవారం రూ. 1.25 కోట్ల నెట్ వసూలు కాగా శనివారం రూ. 2 కోట్లు, ఆదివారం రూ. 3.25 కోట్లు నెట్ కలెక్ట్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ ‘సబర్మతీ రిపోర్ట్’ పై ప్రశంసల జల్లు కురిపించారు. ‘వాస్తవాలు నిదానంగా అయినా బయటకు వస్తాయని, అదే ఇప్పుడు జరుగుతోందని, అందరికీ నిజాలు తెలిసేలా ఈ సినిమా చూపించడం ఆనందంగా ఉంద’ ప్రధాని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *