Telangana

Telangana: రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ షురూ!

Telangana: తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. పోలింగ్ సమయం ముగిసేసరికి క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కించడం మొదలుపెట్టారు.

ముందుగా వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తున్నారు. ఆ తర్వాత సర్పంచ్ స్థానాలకు పోలైన ఓట్లను లెక్కిస్తారు. సర్పంచ్ విజేతలను ప్రకటించిన వెంటనే, ఉప సర్పంచ్‌ ఎన్నిక ప్రక్రియను చేపడతారు. కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి ఓట్ల ద్వారా ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు.
ఈ రెండో విడత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 193 మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లోని మొత్తం 3,911 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల స్థానాలకు 71,071 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ కౌంటింగ్ ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *