Hyderabad: నారా బ్రహ్మణికి ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు

Hyderabad: హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌, ఏపీ మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రహ్మణి ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్నారు. ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ ‘బిజినెస్ టుడే’ ఏటా అందించే ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో బ్రహ్మణి ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ, ఈ గుర్తింపు లభించడం తనకు ఎంతో గౌరవంగా ఉందని తెలిపారు. నాయకత్వంపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, “నాయకత్వం అంటే తాత్కాలిక విజయాలు కాదు, శాశ్వతంగా నిలిచే సంస్థలను నిర్మించడం, బాధ్యతాయుతంగా విలువను సృష్టించడం, ఆ ప్రయాణంలో ప్రజలను శక్తివంతం చేయడం” అని పేర్కొన్నారు.

ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ‘బిజినెస్ టుడే’ సంస్థకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌లో మహిళా నేతలను ప్రోత్సహించే విధంగా ఈ తరహా గుర్తింపులు ఎంతో ప్రేరణనిస్తాయని అభినందించారు. ఎన్‌ఎస్‌ఈ ఇండియాలో తన అభిప్రాయాలను పంచుకునే అవకాశం రావడం ద్వారా అనేక అంశాలు నేర్చుకున్నానని చెప్పారు.

ప్రస్తుతం నారా బ్రహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే, ఆమె తండ్రి నందమూరి బాలకృష్ణ ఛైర్మన్‌గా ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టు బోర్డు సభ్యురాలిగా కూడా సేవలందిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *