CM Chandrababu: ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఫైబర్‌నెట్ కేసులో ఏసీబీ కోర్టు క్లీన్చిట్ ఇస్తూ ప్రధాన కేసును కొట్టివేసింది. వైసీపీ హయాంలో గతంలో నమోదు చేసిన ఈ సీబీఐ కేసులో చంద్రబాబు మాత్రమే కాకుండా, మిగిలిన నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసు 2014–19 మధ్య ఫైబర్‌నెట్ కార్పొరేషన్లో నిబంధనలను ఉల్లంఘించి టెండర్లు కేటాయించడంతో, ప్రభుత్వానికి రూ.114 కోట్ల వరకు నష్టం జరిగిందని మాధుసూదన్‌రెడ్డి ఫిర్యాదు చేసిన కారణంగా. ఆ కేసులో చైర్మన్ వేమూరి హరికృష్ణ, ఎండీ కె.సాంబశివరావు, టెర్రాసాఫ్ట్ డైరెక్టర్ తుమ్మల గోపాలకృష్ణ, భారతదేశంలోని కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు, ఉన్నతాధికారులను నిందితులుగా చేర్చారు.
Also Read: Harish Rao: రాహుల్‌గాంధీ రాకపై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
కొద్దిరోజుల క్రితం సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి, ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం చోటు చేసుకోలేదని నివేదించగా, అసలు ఫిర్యాదుదారుడు మధుసూదన్‌రెడ్డి కూడా గత నెల 24న కోర్టులో కేసు ఉపసంహరించుకున్నట్లుగా అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ కూడా దీనిపై అభ్యంతరం లేదని మరో అఫిడవిట్ సమర్పించారు.
తీర్పు వెలువడే ముందు, ఫైబర్ నెట్ సంస్థ అప్పటి చైర్మన్ గౌతం రెడ్డి, కేసును క్లోజ్ చేయవద్దంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ఏసీబీ కోర్టు, గౌతం రెడ్డి పిటిషన్‌ను తిరస్కరిస్తూ, కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

