Fire Accident: విజయనగరం తెర్లాం మండలంలోని గొలుగువలస గ్రామంలో నిన్న రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పూరి గుడిసెలో మంటలు వ్యాపించి, వృద్ధురాలు సజీవదహనం అయ్యారు. ఈ అగ్నిప్రమాదంలో మొత్తం 10 పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామంలో రాత్రి తమ ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, ఒక్కసారిగా ఒక గుడిసెలో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాప్తి చెందుతూ, పూరి గుడిసెలకు విస్తరించాయి. మంటల్లో చిక్కుకున్న వృద్ధురాలు పాపమ్మ దహించుకొనిపోయి ప్రాణాలు విడిచింది.
Also Read: JanaBhumi Express: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు సమయాల్లో మార్పు..
స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అప్పటికే 10 పూరిళ్లు పూర్తిగా దహనం కావడంతో వాటిట్లో నివసించే వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. బాధితులు ప్రభుత్వ సహాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. “మన కష్టార్జితం మంటల్లో కాలిబూడిదైపోయిందంటూ, ఇప్పుడు ఎవరు మనకు సహాయం చేస్తారు?” అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని గమనిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
