JanaBhumi Express

JanaBhumi Express: జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు సమయాల్లో మార్పు..

JanaBhumi Express:  విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12805/12806) రైలు ప్రయాణ సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రకారం, ఈ మార్పులు 2026 ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి రానుంది.

విశాఖపట్నం నుండి లింగంపల్లికి (12806) రైలు ఉదయం 6.20 గంటలకు బయలుదేరి రాత్రి 7.15 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. మరోవైపు, లింగంపల్లి నుండి విశాఖపట్నానికి (12805) రైలు ఉదయం 6.55 గంటలకు బయలుదేరి రాత్రి 7.50 గంటలకు విశాఖలో చేరుతుంది.

రైల్వే అధికారులు, ప్రయాణికులు కొత్త సమయాలను గమనించాలంటూ సూచించారు. ఈ మార్పు ప్రత్యేకంగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతుందని జోన్‌ సీపీఆర్వో శ్రీధర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read: Vemulawada: వేములవాడ మహిళా పొదుపు సంఘంలో నకిలీ నోట్ల కలకలం

సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది.
సికింద్రాబాద్‌-అనకాపల్లి (నం.07041) రైలు జనవరి 4, 11, 18 తేదీల్లో
అనకాపల్లి-సికింద్రాబాద్‌(నం.07042) రైలు జనవరి 5, 12, 19 తేదీల్లో
హైదరాబాద్‌-గోరఖ్‌పూర్‌(నం.07075) రైలు జనవరి 9, 16, 23 తేదీల్లో
గోరఖ్‌పూర్‌-హైదరాబాద్‌(నం.07076) రైలు జనవరి 11, 18, 25 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

రైల్వే అధికారులు, పండుగ రద్దీ సమయంలో ప్రయాణికుల సౌకర్యం, రైళ్లు సులభంగా చేరుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు నిర్వహించారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *