Hyderabad: ప్రముఖ గాయకుడు, గానగంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారకార్థం రవీంద్రభారతి ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విగ్రహాన్ని ఈ నెల 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు స్రిధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరుకానున్నారు.
విగ్రహం స్థాపనపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఈ వ్యతిరేకతను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
