Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కీలక మలుపు చోటుచేసుకున్నది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు సిట్ అధికారుల ఎదుట లొంగిపోయారు. డిసెంబర్ 12న ఉదయం ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సిట్ ఎదుట హాజరు కావాలని నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలను జారీచేసింది. ఆ మేరకే ఆయన ఈ రోజు పోలీసుల ఎదుట హాజరయ్యారు.
Prabhakar Rao: వారం రోజులపాటు కస్టోడియల్ విచారణకు సుప్రీంకోర్టు గురువారం అనుమతించింది. ఆ తర్వాత వచ్చిన నివేదిక ఆధారంగా మళ్లీ విచారణ జరుపుతామని పేర్కొన్నది. అయితే ఈ సమయంలో ఆయనకు ఎలాంటి హాని కలిగకుండా చూడాలని పేర్కొన్నది. చట్టప్రకారమే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకే ప్రభాకర్‌రావు పోలీసుల ఎదుట హాజరయ్యారు.
