Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీలో వారం కింద చనిపోయిన సర్పంచ్ అభ్యర్థి విజేతగా నిలిచాడు. పోయిన గురువారం సదరు అభ్యర్థి గుండెపోటుతో చనిపోయినప్పటికీ ఆయన పేరు తొలగించకుండానే అధికారులు ఎలక్షన్స్ నిర్వహించారు. దీంతో సదరు వ్యక్తి 378 పైచిలుకు భారీ మెజారిటీతో సర్పంచ్ గెలుపొందగా.. మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన చెర్ల మురళి (50).. బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. ఈ నెల 4న అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు.
Also Read: Alluri Bus Accident: అల్లూరి జిల్లా లో లోయలో పడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 9 మంది మృతి
అప్పటికే బ్యాలెట్ పేపర్లు ముద్రించడంతో అధికారులు గురువారం ఎలక్షన్స్ నిర్వహించారు. చనిపో యిన అభ్యర్థికి జనం ఓటు వేయరని అధికారులు భావించగా, అందుకు విరుద్ధంగా జరిగింది. ఎన్నికల్లో సానుభూతి పనిచేయడంతో చనిపోయిన మురళి తన సమీప అభ్యర్థిపై 378 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ విషయాన్ని అధికారికం గా ప్రకటించిన ఎన్నికల అధికారులు.. అభ్యర్థి చనిపోయినందున ఇక్కడ సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. ఇక మహబూబాబాద్ మండలం నడివాడ సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన బుచ్చిరెడ్డి ఈ నెల 9న గుండెపోటుతో మరణించారు. ఎన్నికల్లో అధికారులు ఆయనకు బ్యాట్ గుర్తు కేటాయించారు. ఇవాళ జరిగిన పోలింగ్లో బుచ్చిరెడ్డికి 165 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి మరణించినా ఓటు వేయడం గమనార్హం.
