Davis Cup Finals 2024

Davis Cup Finals 2024: నడాల్ డౌటే.. డేవిస్ కప్ టోర్నీ

Davis Cup Finals 2024: డేవిస్‌ కప్‌తో కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని ఇప్పటికే ప్రకటించిన టెన్నిస్‌ దిగ్గజం రఫెల్‌ నడాల్.. చివరి సారి కోర్టులో దిగడం సందేహంగా మారింది. సింగిల్స్‌లో గెలిచే స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేనని అనుకుంటే పోటీ నుంచి తప్పుకుంటానని ఈ స్పెయిన్‌ ఆటగాడు తాజాగా ప్రకటించాడు. నెదర్లాండ్స్‌తో పోరులో మంగళవారం స్పెయిన్‌ తలపడాల్సి ఉంది. ఇందులో గెలిస్తే స్పెయిన్ సెమీస్‌ చేరుతుంది. కొంతకాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్న నడాల్ చివరగా పారిస్‌ ఒలింపిక్స్‌ రెండో రౌండ్లో జొకోవిచ్‌ చేతిలో ఓడాడు. ముందుగా శిక్షణలో నా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. సింగిల్స్‌లో గెలిచే స్థాయిలో లేనని అనుకుంటే వెంటనే పోటీకి దూరమవుతానని చెప్పడంతో నడాల్ పోటీకి దిగడంలో అనుమానాలు తలెత్తాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Babu Singapore Tour: చంద్రబాబు ఒకే ఒక్క ప్రజెంటేషన్‌తో పెట్టుబడిదారులు ఫిదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *