Hrithik Roshan:

Hrithik Roshan: ధురంధర్‌పై హృతిక్ వ్యాఖ్యలు వివాదం.. నెటిజన్ల ఫైర్!

Hrithik Roshan: రణ్‌వీర్ సింగ్, మాధవన్, సంజయ్‌దత్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ధురంధర్‌’. ఈ యాక్షన్ ధ్రిల్లర్ డిసెంబర్ 5న విడుదలైంది. ఇప్పటివరకూ రూ.180 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే ఎన్నో ప్రశంసలు అందుకుంటుంది. అయితే, ఈ చిత్రంపై పలువురు ప్రముఖులు రివ్యూ ఇవ్వగా తాజాగా హృతిక్ రోషన్ సినిమా గురించి మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Also Read: Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజ‌న్‌9లో ఊహించ‌ని ట్విస్ట్.. మిడ్ వీక్‌లో ఎలిమినేష‌న్.. బయటకు వెళ్లేది ఎవరంటే?

హృతిక్ రోషన్ ఏమన్నారు అంటే “ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఒక గొప్ప కధను ప్రేక్షకులకు అందించినందుకు చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. సినిమా అంటే ఇలా ఉండాలి అనిపించింది. కానీ ఇందులో చూపించిన రాజకీయపరమైన అంశాలను నేను సమ్మతించలేకపోతున్న. కానీ, కొన్ని అంశాల్లో దర్శకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉండడంతో అలా చూపించినట్టు నేను భావిస్తున్నాఈ చిత్రం నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నా” అని హృతిక్ తెలిపారు. ఇప్పుడు ఈ కామెంట్స్‌ చాలా విమర్శలకు దారితీస్తున్నాయి. ధురంధర్‌లో పాకిస్థాన్‌ చేసిన ఉగ్ర కుట్ర, వారి భయంకరమైన దాడులను చూపారని ఆ విషయాలను మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారని హృతిక్‌పై విమర్శలు కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *